TG: రాష్ట్రప్రజలకు CM రేవంత్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మం, న్యాయం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన ఆదర్శపురుషుడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ధర్మస్వరూపుడు చూపిన మార్గంలో నడుస్తూ జీవితాల్లో సత్యం, సహనం, కర్తవ్యబద్ధతను అలవర్చుకుని ఆదర్శంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఆయన కృపాకటాక్షాలతో అందరి జీవితాల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నిండాలని ఆకాంక్షించారు.