PLD: ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసపోతే నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ హనుమంతరావు ఇవాళ కోరారు. చిలకలూరిపేటకు చెందిన సుభాని, వెంకటేశ్వరరావు కుటుంబాల నుంచి ఇటీవల మోసగాళ్ళు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసానికి పాల్పడిన బత్తుల గణేష్, కుమారస్వామిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.