TG: సీతారాములు ఒకే ఆత్మగా మసిలిన ఆదర్శదంపతులు. వారు ఇద్దరు కాదు.. ఒక్కరే అని చెప్పడానికి రామాయణమంతా నిదర్శనమే! వారి ప్రేమానురాగాలు, దాంపత్య జీవితాన్ని గురించి బాల, అయోధ్యకాండల్లో అందంగా వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల సీతారాముల ఏకత్వాన్ని, ఎడబాటులోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని, వారిద్దరూ ఒకరేనంటూ రుజువు చేసే అంశాలను ఆవిష్కరించారు.