• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ

ASF: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

March 27, 2026 / 09:29 AM IST

‘విశాఖ డెయిరీ విస్తరణకు చర్యలు చేపడుతున్నాం’

VZM: విశాఖ డెయిరీనీ తమిళనాడులో విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఛైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌ తెలిపారు. శుక్రవారం బొబ్బిలి RTC కాంప్లెక్స్‌ వద్ద కొత్త పార్లర్‌ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో ఏడు, చిత్తూరులో ఏడు కేంద్రాల్లో శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 250 ఉత్పత్తులు తయారు చేస్తూ, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

March 27, 2026 / 09:26 AM IST

ఈ ప్రాంతాల మీదుగా శోభాయాత్ర

TG: శ్రీరామనవమి సందర్భంగా HYDలో ఇవాళ శోభాయాత్ర జరగనుంది. కోఠిలోని సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. సీతారాంబాగ్ వద్ద మొదలయ్యే యాత్ర భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పి.ఎస్. రోడ్, ధూల్‌పేట్, పురానాపూల్, బేగంబజార్ ఛత్రి, గౌలిగూడ చమన్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ మీదుగా సుల్తాన్ బజార్‌కు చేరుకుంటుంది.

March 27, 2026 / 09:24 AM IST

కబడ్డీ పోటీలను ప్రారంభించిన రాయల నాగేశ్వరరావు

KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల స్థాయి పోటీల్లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పోటీలను ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి ఆడి వారిని ప్రోత్సహించారు.

March 27, 2026 / 09:23 AM IST

EVM గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్

కడప: నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా ఇంఛార్జ్ రెవెన్యూ అధికారి వెంకటపతి, శ్రీకాంత్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

March 27, 2026 / 09:23 AM IST

పెద్దాపురం సీఐగా వైఆర్కే శ్రీనివాస్

KKD: పెద్దాపురం సీఐగా వైఆర్కే శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇవాళ ఉదయం 11:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం జగ్గంపేట సీఐగా పనిచేస్తున్నారు. 2009లో పెద్దాపురం ఎస్సైగా, 2018లో సీఐగా పనిచేశారు. ఇంత వరకు సీఐగా పనిచేస్తున్న సీహెచ్ విజయ శంకర్‌ను బదిలీ చేసి పోస్టింగ్ చూపించలేదు.

March 27, 2026 / 09:20 AM IST

చెన్నకేశవ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

ATP: పామిడిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం అద్భుతం జరిగింది. స్వామివారి పాదాలను సూర్య కిరణాలు తాకాయి. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత కూడా ఈ సూర్య కిరణాలు తాకుతాయని అర్చకుడు పురుషోత్తం తెలిపారు. ఈ అద్భుతాన్ని తిలికించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అధిక రద్దీ నెలకొంది.

March 27, 2026 / 09:20 AM IST

పోలీసుల పల్లె నిద్ర.. గ్రామాల్లో నేర నియంత్రణ

ELR: కామవరపుకోట మండలం కె.ఎస్. రాఘవరం గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు పోలీసుల మధ్య దూరాన్ని తగ్గించి, గ్రామాల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో నేర నియంత్రణ, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు మూడవ కన్నులా పనిచేస్తాయని తడికలపూడి ఎస్సై చిన్నారావు అన్నారు.

March 27, 2026 / 09:19 AM IST

నేడు బంధువులకు మృతదేహాల అప్పగింత

AP: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. డీఎన్‌ఏ నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. డీఎన్ఏ నివేదికలు రాగానే బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే, బస్సు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.

March 27, 2026 / 09:18 AM IST

కోదండ రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన చమర్తి

KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి. టీడీపీ రాజంపేట ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్ 1న కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

March 27, 2026 / 09:17 AM IST

విధులకు గైర్హాజరు.. టీచర్ సస్పెండ్

అన్నమయ్య: విధులకు సక్రమంగా హాజరు కాని టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు రవికుమార్ తెలిపారు. వీరబల్లి ఉప్పరపల్లెలోని ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి 2022 జూలై 1 నుంచి ఎటువంటి సమాచారం లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఈవో నోటీసులకు స్పందించకపోవడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.

March 27, 2026 / 09:17 AM IST

ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు: లోకేష్

AP: ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడని మంత్రి లోకేష్ అన్నారు. సుపరిపాలనకు శాశ్వత నమూనా రామరాజ్యమని గుర్తుచేశారు. లోకకల్యాణం కోసం సీతారాముల కల్యాణం కమనీయంగా సాగాలని ప్రార్థించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

March 27, 2026 / 09:16 AM IST

‘పెనాల్టీ ఉత్తర్వులు తీసేయండి మేడమ్’

ELR: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై విధించిన పెనాల్టీలను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో నాయకులు గురువారం డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం అందజేశారు. పెనాల్టీల భయంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీనివల్ల మూల్యాంకన నాణ్యత దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి రహిత వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

March 27, 2026 / 09:15 AM IST

గడ్డివాములు అగ్నికి ఆహుతి.. తీవ్ర నష్టం

KRNL: దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామ సమీపంలో లక్కందిన్నె రోడ్డువైపు గడ్డివాముల వద్ద గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. హరిజన పెద్దయ్యకు చెందిన ఐదు గడ్డివాములు, వెంకన్నకు చెందిన పశువుల పాక, వ్యవసాయ సామగ్రి కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

March 27, 2026 / 09:14 AM IST

భారీ ఊరట: తగ్గిన పెట్రోల్ రద్దీ

TG: హైదరాబాద్ నగరంలో గత మూడురోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కొనసాగిన రద్దీ.. నేడు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత తగ్గిపోయి వాహనదారులకు పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు, పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో చమురు కొరత ఏర్పడవచ్చనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు.

March 27, 2026 / 09:14 AM IST