KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల స్థాయి పోటీల్లో భాగంగా నాలుగు మ్యాచ్లు జరిగాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పోటీలను ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి ఆడి వారిని ప్రోత్సహించారు.