VZM: విశాఖ డెయిరీనీ తమిళనాడులో విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఛైర్మన్ ఆడారి ఆనందకుమార్ తెలిపారు. శుక్రవారం బొబ్బిలి RTC కాంప్లెక్స్ వద్ద కొత్త పార్లర్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో ఏడు, చిత్తూరులో ఏడు కేంద్రాల్లో శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 250 ఉత్పత్తులు తయారు చేస్తూ, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.