• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తై బజార్ వేలం వాయిదా: మున్సిపల్ కమిషనర్

WNP: పురపాలిక పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి తై బజార్ వారాంతపు సంత, జంతువధశాల వేలం గురువారం నిర్వహించాల్సి ఉండగా సరిపడా దరఖాస్తులు రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వేలం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

March 27, 2026 / 09:05 AM IST

‘విద్యార్థులు ప్రపంచస్థాయి పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి’

VKB: విద్యార్థులు ప్రపంచస్థాయి పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పర్వతాలు అన్నారు. కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఎక్స్ ఫ్లోరింగ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఇన్ మెథడాలజీ’ అనే అంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డా.బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

March 27, 2026 / 09:04 AM IST

మహేశ్వరంలో నూతన బార్ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

RR: మహేశ్వరం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రిటర్నింగ్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్ రెడ్డి, జి.అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా పి. శ్రీపాల్ రెడ్డి, తదితరులు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా పి.అశోక్, ట్రెజరర్‌గా జి.మల్లేశ్, లైబ్రేరియన్‌గా కే.సాయికిరణ్ ఎన్నికయ్యారు.

March 27, 2026 / 09:03 AM IST

గుర్రంపేటలో సీతారాముల కళ్యాణానికి సిద్ధం

BHPL: భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయం నుంచే భక్తులు దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని వారు కోరారు.

March 27, 2026 / 09:03 AM IST

తుంగతుర్తి మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

SRPT: ఎమ్మెల్యే మందుల సామేలు నేడు తుంగతుర్తి మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వేడుకను విజయవంతం చేయాలని అధికారులు, నిర్వాహకులు కోరారు.

March 27, 2026 / 09:03 AM IST

బియ్యం వ్యాపారి ఇంట్లో తనిఖీ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు బృందం

NLG: మిర్యాలగూడ పట్టణంలో బియ్యం వ్యాపారి ఇంట్లో గురువారం ఢిల్లీలోని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బృందం తనిఖీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ళ గోపి ఇంట్లో, వ్యాపార కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రతినిధులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

March 27, 2026 / 09:01 AM IST

విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?

ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తూ.. ఉమ్మడి ఆస్తి కొంటున్నారు. కానీ ఒకరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అది విడాకుల సమయంలో రెండో వ్యక్తికి చట్టపరమైన ఇబ్బందులు కలిగిస్తోంది. అందుకే కొనుగోలు సమయంలోనే భార్యాభర్తలిద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. డౌన్ పేమెంట్స్ లేదా EMIలు చెల్లించినప్పుడు ఆ లావాదేవీల రికార్డులను, బ్యాంక్ స్టేట్‌మెంట్లను భద్రపరుచుకోవాలి.

March 27, 2026 / 09:01 AM IST

నేడు పలు రామాలయాల్లో కవిత పట్టుపస్త్రాలు సమర్పన

NZB: శ్రీరామ నవమి సందర్భంగా NZB నియోజవర్గ పరిధిలోని రామాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. ఈఏడాది రఘునాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్‌పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల, మల్లాపూర్ లోని వాల్గొండ రామాలయాలో పట్టువస్త్రాలు అందజేస్తారు.

March 27, 2026 / 09:01 AM IST

అస్వస్థతతో టీడీపీ సీనియర్ నేత మృతి

NLR: టీడీపీ సీనియర్ నేత కొండూరు సుధాకర్ రెడ్డి గురువారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన ఆయన అస్వస్థతతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయన గంగపట్నం ఆలయ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన మృతి పట్ల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.

March 27, 2026 / 09:00 AM IST

పాల డైరీలో చోరీ.. నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

ATP: గుత్తి పట్టణంలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ సమీపంలో గల పాల డైరీలో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాల డైరీ తాళాలు పగలగొట్టి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.10వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 27, 2026 / 09:00 AM IST

హిందూపురంలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

SS: హిందూపురం పట్టణంలో పోలీసులు గురువారం రాత్రి నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. తిలక్ నగర్, మోడల్ కాలనీ వంటి ప్రధాన ప్రాంతాల్లో సీఐ జనార్ధన్ ఆధునిక సాంకేతికతతో తనిఖీలు చేశారు.

March 27, 2026 / 09:00 AM IST

గ్యాస్ సరఫరాపై అపోహలు సృష్టిస్తే చర్యలు: DSO

కోనసీమ: ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్వో ఉదయ్ భాస్కర్ హెచ్చరించారు. గురువారం ఆయన జిల్లాలోని పలు ఏజెన్సీల్లో అమ్మకాలను పరిశీలించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదన్నారు. ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో సరఫరా జరుగుతోందన్నారు. గ్యాస్ బుకింగ్, సరఫరాలో ఇబ్బందులు ఉంటే 94416 92275 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

March 27, 2026 / 09:00 AM IST

అన్నవరం సత్యదేవుని ఆదాయం ఎంతంటే..?

KKD: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.19.55 కోట్లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13 సార్లు హుండీలను తెరచి లెక్కించారు. గతేడాది జూన్, నవంబరు, డిసెంబరు మాసాల్లో అత్యధిక ఆదాయం వచ్చింది. రోజు సరాసరి హుండీల ద్వారా రూ.5.35 లక్షలు ఆదాయం సమకూరిందని ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాధరావు తెలిపారు.

March 27, 2026 / 09:00 AM IST

విద్యార్థులకు బహుమతులు అందజేసిన సీఐ

PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న పలు పాఠశాలల విద్యార్థులకు పోలీసు చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. ఆనంతరం పోలీసు చట్టాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో తమ అభిప్రాయాలను చిత్రాల రూపంలో నిక్షిప్తం చేశారు. గెలిచిన విదార్థులకు పట్టణ సీఐ వెంకటరావు బహుమతులు ప్రధానం చేశారు.

March 27, 2026 / 08:57 AM IST

నేడు ఇలా చేస్తే.. సకల శుభాలు మీ వెంటే!

శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ సీతారామచంద్ర స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తితో చేసే పూజలు మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో సహాయపడతాయి. ‘ఓం శ్రీ రామాయ నమః’, ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ’ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కనీసం 108 సార్లు జపించడం ఉత్తమం.

March 27, 2026 / 08:56 AM IST