సిరిసిల్ల నేత పరిశ్రమ, కార్మికుల పరిస్థితి తెలుసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని గవర్నర్ శివ ప్రకాశ్ శుక్లా తెలిపినట్లు చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇవ్వాళ రాజ్ భవన్లో గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు వెదురుతో చేసిన మరమగ్గం జ్ఞాపికను ఆయనకు అందజేశారు.