NTR: మైలవరం యువత అధ్యక్షుడిగా మూడోసారి నియమితులైన లంక సతీశ్‌ను MRPS ఇంఛార్జ్ శరత్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోనే స్మశాన వాటిక లేని గ్రామంగా సజ్జపాడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఈ సమస్యను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన స్మశాన వాటిక మంజూరయ్యేలా కృషి చేస్తానని సతీశ్ హామీ ఇచ్చారు.
CTR: పూతలపట్టు(M)ముతిరేవుల సమీపంలోని SVECలో ఇవాళ హ్యాక్‌థాన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. మోహన్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 900 మందికి పైగా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనపరచిన వారికి రూ.1.75 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.
SKLM: పూండి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలిశారు. ఈ మేరకు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పూండి రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నారు.
NLR: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధానంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం, అనంతరం కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం 6గంటలకు బంగారు హనుమంతు సేవ నిర్వహిస్తామని తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఇవాళ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతుల కారణంగా ప్రజలు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద చేరి ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతోందని, వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటాం.
రామ్ చరణ్, బుచ్చిబాబుల భారీ చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. చరణ్ పుట్టినరోజైన మార్చి 27న బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో దీన్ని ఏప్రిల్ 8కి వాయిదా వేశారు. అదే రోజున డి-బాక్స్, డాల్బీ సినిమా వంటి ప్రీమియం ఫార్మాట్ల టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని భీంపురం 11వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ సంజీవ్ ప్రారంభించి, పనులను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
MHBD: మొక్కజొన్న రైతులు మద్దతు ధర లేక భారీ నష్టాలు చవిచూస్తున్నారని కొత్తగూడ మండల బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఒక్క క్వింటాల్‌కు 1600 నుంచి 1800 రూపాయలకు మాత్రమే విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
మార్కాపురం జిల్లాలో టిప్పర్-బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారి వివరాలు తెలుసుకోవడానికి ఆర్డీవో ఆఫీస్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఏదైనా సమాచారం కోసం విష్ణువర్ధన్ (6304285613), కిషోర్ (9985733999), రాఘవేంద్ర (7989537285) నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.
ADB: ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేశ్ ఇవాళ హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అరెస్టయ్యారు. ఈ సందర్బంగా ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో అక్కడి పోలీసులు ఆయన్ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా నిరుద్యోగుల తరఫునే పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.
MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధి నార్లపూర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. మంచిర్యాల వైపు వెల్లుల్లి లోడ్‌తో వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెల్లుల్లి బస్తాలు చెల్లాచెదురుగా పడటంతో రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది.
PPM: సాలూరు రూరల్ ఎస్సైగా బి. రవీంద్ర రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఇంఛార్జ్ ఎస్సై వెంకటరమణ నుంచి బాధ్యతలు చేపట్టారు. పార్వతీపురం సైబర్ సెల్ విభాగంలో పనిచేసిన రవీంద్రరాజును ఎస్పీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.
SKLM: టెక్కలిలోని బస్ స్టాండ్, దుకాణాలు, పలు ప్రాంతాల్లో పోలీసులు జాగిలాలతో బుధవారం సీఐ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు, తదితర మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్, ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుంటూరు: పల్నాడు జిల్లాలకు చెందిన ముగ్గురు స్నేహితులకు హన్మకొండ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆల్ప్రాజోలం మాత్రలతో డ్రగ్ పొడి తయారు చేసి న్యూఇయర్ వేడుకల్లో విక్రయానికి 2023లో హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నేరం రుజువై వారికి శిక్ష పడినట్లు పోలీసులు వెల్లడించారు.