• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సిద్దిపేటలో పెట్రోల్ వదంతులు.. సీపీ హెచ్చరిక

సిద్దిపేట జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. వదంతులు నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

March 26, 2026 / 08:19 AM IST

డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం.. కేసులు నమోదు

MBNR: డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా జిల్లాలోని హోటళ్లు,రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీలు చేయగా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

March 26, 2026 / 08:16 AM IST

బాపట్లలో గ్యాస్ సిలిండర్ల సరఫరా వివరాలు వెల్లడి

బాపట్ల జిల్లాలో గృహ వినియోగానికి 3,389 గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల అధికారి జమీర్ బాషా తెలిపారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే బుకింగ్ చేయాలని సూచించారు. గ్యాస్ సంబంధిత సమాచారం కోసం 94932 47765 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.

March 26, 2026 / 08:15 AM IST

శ్రీరామనవమి.. పెళ్లి కాని వారు ఇలా చేస్తే!

శ్రీరామనవమి వేడుకలకు దేశం ముస్తాబైంది. కొన్నాళ్ల క్రితం రాములోరి కల్యాణం అయ్యే వరకు ఇళ్లలో పెళ్లిళ్లు జరిగేవి కావు. కల్యాణం తర్వాతనే ముహూర్తాలు పెట్టుకునే వారు. అయితే, రామయ్య కల్యాణ తలంబ్రాలను ఇంట్లో వివాహం కాని యువతీ యువకుల శిరస్సు పైన వేసినట్లయితే వారికి వివాహం అవుతుందని నమ్ముతారు. పెళ్లి కానివారు ఈ ఆచారాన్ని పాటిస్తే.. త్వరగా వివాహం అవుతుందట.

March 26, 2026 / 08:15 AM IST

ఇంధన అక్రమ నిల్వలపై ఎస్సై హెచ్చరిక

VKB: పెద్దేముల్లో ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్ నిల్వ చేయడం వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమై పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. పెట్రోల్ ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ఆయన కోరారు.

March 26, 2026 / 08:15 AM IST

మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు

TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, MDK, సంగారెడ్డి, సిద్ధిపేట, హన్మకొండ, WGL, యాదాద్రి, MBNR, NGKL, WNP, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

March 26, 2026 / 08:13 AM IST

బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలిపారు.

March 26, 2026 / 08:12 AM IST

నల్లగండ్ల హుడా కాలనీలో వెలిగిన సెంట్రల్ లైటింగ్

RR: నల్లగండ్ల హుడా కాలనీలో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను MLA అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అత్యాధునిక వీధి దీపాల వల్ల కాలనీకి కొత్త శోభ రావడమే కాకుండా, రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారుల ప్రయాణం సురక్షితంగా మారుతుందని తెలిపారు.

March 26, 2026 / 08:11 AM IST

హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు

SRCL: వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బుధవారం స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గత 8 నెలల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, ఆలయానికి మొత్తం రూ.6,07,481 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

March 26, 2026 / 08:11 AM IST

డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం..!

NDL: బేతంచెర్ల – బనగానపల్లె రహదారిలో జంగలపేట కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతూ.. దట్టమైన పొగ వ్యాపించింది. మంటలను అదుపులోకి తేవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కాలనీవాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

March 26, 2026 / 08:11 AM IST

‘పన్నులు వసూళ్లలో నిర్లక్ష్యం వహించవద్దు’

W.G. భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బుధవారం ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. బకాయిలు ఉన్నవారికి కుళాయి కనెక్షన్ నిలుపుదల, ట్రేడ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. 50% పన్ను రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 26, 2026 / 08:10 AM IST

బొల్లాపల్లి తహసీల్దార్‌గా చంద్రశేఖర్

PLD: బొల్లాపల్లి మండల తహసీల్దార్ ఎస్.చంద్రశేఖర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ సమస్యలు సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్‌కు మండల సిబ్బంది అభినందనలు తెలిపారు.

March 26, 2026 / 08:10 AM IST

‘ఈ చెత్త సమస్యను పరిష్కరించండి’

KDP: ప్రొద్దుటూరు మండలం అమృతనగర్లో చెత్త సమస్య వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం తెలిపారు. బుధవారం అమృతనగర్ 34వ వీధిలో స్థానిక మహిళతో కలిసి ఆమె మాట్లాడారు. కొత్తపల్లి గ్రామపంచాయతీలోని చెత్తనంతా తీసుకువచ్చి ఇక్కడ వేస్తున్నారన్నారు. దీనివల్ల దుర్వాసన, వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

March 26, 2026 / 08:10 AM IST

పెద్దగూడెంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

వనపర్తి మండలం పెద్దగూడెం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 11:30 గంటలకు సుముహూర్తంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో మంగళసూత్రం ధరించగా అర్చకుడు రమణయ్య పెళ్లి క్రతువును నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించగా, ఇక్కడ సీతారాముల కళ్యాణం సప్తమి రోజున నిర్వహించడం సంప్రదాయమని స్థానికులు తెలిపారు.

March 26, 2026 / 08:09 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,411 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,474 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

March 26, 2026 / 08:08 AM IST