HYD: దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉందని అటు ప్రభుత్వం అధికారులు చెబుతున్నప్పటికీ సికింద్రాబాద్ ప్రాంతాల్లోని అనేక పెట్రోల్ బంకుల వద్ద రద్దు ఏ మాత్రం తగ్గటం లేదు. ఒక్కసారిగా అందరూ ఫుల్ ట్యాంక్ చేపివ్వడం వల్ల ఇబ్బంది కలుగుతున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు.
ASF: బీసీల హక్కుల కోసం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు జరిగిన నిరసన ర్యాలీలో జిల్లా MLA కోవ లక్ష్మి ఇవాళ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో BCల కోసం ప్రత్యేకంగా రూ.22 వేల కోట్లు కేటాయించాలని, BC కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థలానికి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చేరుకున్నారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.
BDK: భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక రేపు వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రామాలయ అభివృద్ధికి 351 కోట్ల నిధులు మంజూరు కాగా 3 దశల్లో 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ధన్యవాదాలు తెలిపారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపెట్ గ్రామంలో గురువారం ఎంపీడీవో గీతాంజలి నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మొక్కలకు నీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో హైమావతి, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, మేట్ ఫర్హాన, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం నేపథ్యంలో కీలక విషయం వెల్లడైంది. బస్సు కండీషన్ సరిగా లేదని ప్రయాణికులు ఆందోళన చేయగా.. సిబ్బంది యర్రగొండపాలెం వద్ద బస్సు గంటసేపు నిలిపి మరమ్మతులు చేశారు. అనంతరం బస్సు బయల్దేరగా రాయవరం వద్ద ఘోరం జరిగింది. డ్రైవర్‌ను విచారించగా.. స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పినట్లు సమాచారం.
2025-26 ఏడాదిలోని మూడో త్రైమాసికంలో తమ వెబ్ సైట్‌పై సైబర్ దాడులకు యత్నాలు జరిగినట్లు RBI వెల్లడించింది. ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి చేసేందుకు యత్నించినట్లు చెప్పింది. అయితే అత్యాధునిక రక్షణ వ్యవస్థ కారణంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. గతేడాది ఏప్రిల్- జూన్ మధ్య 1.9 కోట్లు, జులై-సెప్టెంబర్ మధ్య 3.1 కోట్ల సార్లు దాడికి యత్నించినట్లు తెలిపింది.
NDL: మార్కాపురం జిల్లాలో ఇవాళ జరిగిన బస్సు, టిప్పర్ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుని పదిమంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
KDP: గ్యాస్ కొరత ప్రభావంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 11,400 కేంద్రాలకు స్టవ్‌లు అందించగా.. సానుకూల స్పందన రావడంతో మిగిలిన వాటికి ఇవ్వాలని నిర్ణయించింది.
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆ పాఠశాలకు మైక్ సెట్ బహూకరించారు. గురువారం ఆ మైక్ సెట్‌ను ఇచ్చినట్లు హెచ్ఎం చెంచురామయ్య ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దాదాపుగా 61 వేలు విలువైన మైక్ సెట్‌ను బహుకరించినట్లు తెలియజేశారు. పూర్వ విద్యార్థులకు, పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల భూ వివాదంలో చిక్కుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని ఆయన CCS పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేరే వ్యక్తులకు చెందిన భూమిని తనకు అమ్మారని, ఇందుకోసం గతంలో రూ.కోటి చెల్లించానని పేర్కొన్నాడు. ఇటీవల కోర్టు తీర్పుతో ఈ విషయం వెలుగులోకి రాగా, ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అంచనా.
HNK: శాయంపేట మండలం కేంద్రానికి చెందిన సీనియర్ అడ్వకేట్ గట్ల విజయ్ పాల్ రెడ్డి మాతృమూర్తి గట్ల అహల్యమ్మ ఇవాళ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
HYD: త్వరలో జరిగే గోదావరి పుష్కరాల దృష్ట్యా సికింద్రాబాద్ డివిజన్ DRM డా. గోపాలకృష్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వైపు వెళ్లే మార్గాలపై రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ట్రాక్ భద్రత అంశాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తామన్నా.. కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారని మండిపడ్డారు. ఇప్పుడు 50 శాతం పెంచుతామంటే కూడా ఒప్పుకోమంటున్నారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే పార్లమెంట్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు.