మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదంలో కనిగిరి చెందిన తల్లి కొడుకును వేరు చేసిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ముందు కుమారుడైన మనోహర్‌ను బస్సు బయటకి తోసివేసి తర్వాత బయటకు దూకేందుకు ప్రయత్నించిన తల్లి రమాదేవి చివరికి మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతి అయ్యింది. కళ్ల ముందే తల్లి దహనమవుతుంటే కాపాడుకోలేని దురదృష్టవంతుణ్ణి అంటూ రోదిస్తున్నఆ యువకుడి బాధ వర్ణానాతీతంగా మారింది.
ATP: గుత్తిలోని పురాతన కోట రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీతారాముల ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం, సంప్రోక్షణ వంటి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
PDPL: గ్రామాలలో 100% పన్ను వసూలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యాలయాల సైతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో గోబాల సంబరానికి ఎమ్మెల్యే జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లేగదూడల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఎంసీ ఛైర్‌పర్సన్ కళావతి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశువైద్యశాఖ అధికారులు, గ్రామస్తులు, పాడి రైతులు పాల్గొన్నారు.
SKLM: పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని MPDO వాసుదేవరావు సూచించారు.
JGL: ఎండపల్లి మండలంలోని గుల్లకోట ప్రాథమిక పాఠశాలకు దాత బుర్ర విజయ్ రూ.10వేల విలువైన బీరువాను అందించారు. పాఠశాల కార్యాలయ రికార్డులు, విద్యార్థుల బోధనాభ్యసన పత్రాలను భద్రపరచేందుకు తన తండ్రి కీ.శే.బుర్ర శంకరయ్య జ్ఞాపకార్థం ఈ సహాయం అందించినట్లు దాత తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి, ఉపాధ్యాయులు దాతను శాలువాతో సన్మానించారు.
ప్రపంచ వ్యాప్తంగా X సేవలు నిలిచిపోయాయి. పలు దేశాల్లోని యుజర్లు X ఖాతాను తెరిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు అంతరాయానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. సేవల్లో అంతరాయంపై X స్పందించాల్సి ఉంది.
రజీషా విజయన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ ‘మస్తిష్క మరణం’. ఇప్పటికే థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 2022లో విడుదలైన ‘వధ్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన క్రైమ్ డ్రామా ‘వధ్ 2’. ఈ సినిమా ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటు...
AP: ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద స్థలాన్ని మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో సమీక్షించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఐజీ త్రిపాఠి ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించగా, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు.
AP వైద్య విద్య విభాగం(DME)లో 284 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29తో ముగియనుంది. పోస్టును బట్టి MD/MS, DNBలో ఉత్తీర్ణతతో పాటు AP మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.80,500 గౌరవ వేతనం ఉంటుంది. దరఖాస్లు ఫీజు రూ.2000. BC/SC/STలకు రూ.1000. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NLR: సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని గురువారం ఉదయగిరి డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. మార్కాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురవడం విచారకరమన్నారు. ఉదయగిరి డిపో నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MDCL: మేడ్చల్లో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముకుంద థియేటర్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ సమీపంలో ఉన్న ఈ మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముంది. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులు, పాదచారులకు ఇది పెద్ద ముప్పుగా మారిందని, వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.
SKLM: జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు అందరు రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు పిలుపునిచ్చారు. గురువారం ఆయన కె ఆర్ స్టేడియంలో క్రీడా పోటీలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, ఉద్యోగుల ఐక్యత పెంపొందిస్తాయన్నారు.
NLG: కనగల్ మండలం దర్వేశపురం ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని ఎల్లమ్మ తల్లిని కోరుకున్నారు. దేవస్థానం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.