• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తాడిహత్నూరులో ఉపాధిహామీపై గ్రామసభ

ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఉపాధిహామీపై అడిట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ అధికారులు, సామజిక తనిఖీ బృందం గ్రామసభ నిర్వహించి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో DRP అశోక్, CO జంగు, సర్పంచ్ రాథోడ్ దిలీప్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఉపసర్పంచ్ జనాబాయి రాథోడ్, TAలు సాదిక్, లావణ్య, FA మోతిరాం తదితరులున్నారు.

March 26, 2026 / 12:44 PM IST

షూటింగ్ చివరి రోజున రణ్‌వీర్ స్పెషల్ సర్‌ప్రైజ్

రణ్‌వీర్ సింగ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ధురందర్’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా తన హెయిర్ స్టైలిస్ట్ ముస్కాన్‌కు రణ్‌వీర్ స్వయంగా చేతితో రాసిన కృతజ్ఞతా లేఖను అందించాడు. ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సెట్‌లోని సిబ్బంది పట్ల రణ్‌వీర్ చూపిన గౌరవానికి నెటిజన్లు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

March 26, 2026 / 12:44 PM IST

మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి

TG: రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని వెల్లడించారు. కాగా, పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, మైనార్టీ, సంక్షేమ శాఖల పద్దులను అసెంబ్లీ ఆమోదించింది.

March 26, 2026 / 12:43 PM IST

యాడికిలో ఐదేళ్ల బాలుడు దారుణ హత్య

ATP: యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన ఐదేళ్ల హేమచంద్ర నేడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం కిడ్నాప్‌నకు గురైన బాలుడిని దుండగులు హత్య చేసి కందనకోట కొండల్లో పడేశారు. బాలుడిని సొంత బావనే హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

March 26, 2026 / 12:43 PM IST

సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పరిశీలన

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో కొనసాగుతున్న (HPV) వ్యాక్సినేషన్ ప్రక్రియను గురువారం సూపరింటెండెంట్ లింబాద్రి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టీకా పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

March 26, 2026 / 12:43 PM IST

గురుకులల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం

వనపర్తి: పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో సీడబ్ల్యూఎస్ఎన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష రాసి మంచి ప్రతిభ కనబరిచారు. గురువారం వనపర్తి డీఈఓ కార్యాలయంలో విద్యార్థులను డీఈఓ అబ్దుల్ ఘని, జేసీడీఓ సుబ్బలక్ష్మి కలిసి విద్యార్థులను సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పినట్లు చదివినట్లయితే మంచి ర్యాంకులు సాధించగలమన్నారు.

March 26, 2026 / 12:43 PM IST

ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి

WGL: గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఆటో బోల్తా పడిన సంఘటనలో పదవ తరగతి విద్యార్థి అక్షయ్ మృతి చెందాడు. నిన్న రాత్రి ఆటోలో నీళ్లు తరలిస్తున్న సమయంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. తీవ్ర గాయాలైన బాలుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అక్షయ్ ఇప్పటికే మూడు పరీక్షలు రాసాడు. అతని మృతితో తల్లిదండ్రులు కన్నీళ్లు మున్నీరుగా విలపించారు.

March 26, 2026 / 12:42 PM IST

సర్కారీ బడిలో చేర్పించండి: MEO

NTR: జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో గురువారం మండల విద్యాధికారి చిట్టిబాబు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం గురించి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల క్రమశిక్షణ ప్రభుత్వం అందజేసే పథకాలను గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేశారు.

March 26, 2026 / 12:41 PM IST

గర్భాంలో ఉచిత పశు వైద్య శిబిరం

VZM: మెరకముడుదాం మండలం గర్భాంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ ఛైర్మన్ తాటి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ పశువులను తీసుకొచ్చారు.

March 26, 2026 / 12:40 PM IST

సంచార జాతుల కుల ధ్రువీకరణపై వినతి

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘జనతా వారధి’ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ బృందం సంచార, అర్ధ సంచార జాతుల కుల ధ్రువీకరణ సమస్యలపై కలెక్టర్ S.వెంకటేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించింది. సరైన గుర్తింపు పత్రాలు లేక ఈ వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నాయని తెలిపారు.

March 26, 2026 / 12:40 PM IST

అమరావతి రాజధాని రెండో దశకు మాస్టర్ ప్లాన్ సిద్ధం

GNTR: రాజధాని 2వ దశ అభివృద్ధికి CRDA కసరత్తు ముమ్మరం చేసింది. 1,75,347 ఎకరాల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థకు అప్పగించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, వాణిజ్య ప్రాంతాలు, రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగనుంది. తొలి దశ ప్లాన్‌ను రూపొందించిన ఈ సంస్థే మళ్లీ చేపడుతుండడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.

March 26, 2026 / 12:40 PM IST

తాగునీటి బోరుకు మరమ్మతులు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని బోరు మోటారుకు కౌన్సిలర్ మహమ్మద్ సాదిక్ మరమ్మతులు చేయించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను గుర్తించిన కౌన్సిలర్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని మరమ్మతులు చేపట్టారు. బోరుకు మరమ్మతులు చేయించినందుకు కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

March 26, 2026 / 12:39 PM IST

ఆరోగ్య చైతన్య యాత్రకు మంత్రి ప్రశంసలు

సత్యసాయి: అమరావతి సచివాలయంలో ‘మిషన్ హెల్తీ భారత్’ యాత్ర నిర్వహిస్తున్న యువతి తాప్సీ ఉపాధ్యాయను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సత్కరించారు. మీరట్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ యాత్ర ద్వారా ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 17,400 కిలోమీటర్లు ప్రయాణించి, ఊబకాయంపై అవగాహన కల్పించినట్లు ఆమె వివరించారు.

March 26, 2026 / 12:36 PM IST

విద్యార్థుల దాహార్తి తీర్చిన సర్పంచ్

SRCL: వీర్నపల్లి మండలం జవహర్లాల్ నాయక్ తండాలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల నీటి కష్టాలను గమనించిన సర్పంచ్ భూక్యా లతా జనార్ధన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. సొంత ఖర్చుతో నూతన బోరు మోటార్ను ఏర్పాటు చేసి విద్యార్థుల దాహార్తిని తీర్చారు. పాఠశాలలో కనీస సౌకర్యాల కల్పనే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భెంగా తెలిపారు.

March 26, 2026 / 12:34 PM IST

పార్టీ బలోపేతంలో క్లస్టర్ ఇంఛార్జ్‌లే కీలకం: ఎమ్మెల్యే

ATP: మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌లకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో క్లస్టర్ ఇంఛార్జ్‌ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు.

March 26, 2026 / 12:34 PM IST