RR: షాద్నగర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని బోరు మోటారుకు కౌన్సిలర్ మహమ్మద్ సాదిక్ మరమ్మతులు చేయించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను గుర్తించిన కౌన్సిలర్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని మరమ్మతులు చేపట్టారు. బోరుకు మరమ్మతులు చేయించినందుకు కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.