• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోంది: హరీశ్ రావు

HYD: ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోందని, దీంతో చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినా కేవలం 496 మందికే ఇచ్చారని వివరించారు.

March 26, 2026 / 01:36 PM IST

గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించడమే లక్ష్యం: SP

BHPL: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఇవాళ అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌లో SP పాల్గొన్నారు. SP మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి మెగా వైద్య శిబిరాలను కొనసాగిస్తామన్నారు.

March 26, 2026 / 01:35 PM IST

నేటి సమాజానికి ఆదర్శనీయం: సుధాకర్ రెడ్డి

MHBD: నిస్వార్థ ప్రజానాయకుడు కామ్రేడ్ ధర్మబిక్షం జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి అన్నారు. కురవిలో ధర్మబిక్షం 15వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ సీనియర్ నాయకులు బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బొల్లం విజయ్, బొల్లం అనిల్,, తదితరులు ఉన్నారు.

March 26, 2026 / 01:35 PM IST

శ్రీ సీతారామస్వామి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పణ

JGL: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలోని పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయలో జరిగే కళ్యాణోత్సవంకు ఆలయ అధికారులు ఇవాళ పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పక్షాన స్వామి వారికి వాయిద్యాలు నడుమ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

March 26, 2026 / 01:34 PM IST

ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని: MLA

JN: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి భక్తులు వస్తుంటారని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్మినెంట్‌గా కళ్యాణ మండపం, మెట్లు, పర్మినెంట్‌గా అఖండ జ్యోతి ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

March 26, 2026 / 01:34 PM IST

స్పోర్ట్స్ స్కూల్లో సీట్ల భర్తీకి ఎంపికలు

MHBD: కొత్తగూడలోని గిరిజన మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతిలో 40 సీట్లను భర్తీ చేసేందుకు ఎంపికలు జరగనున్నట్లు ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు దేశీరాం గురువారం తెలిపారు. ఉమ్మడి WGL జిల్లాలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న గిరిజన(ST) బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఈనెల 28,29,30 తేదీలలో కొత్తగూడ స్పోర్ట్స్ స్కూల్లో ఎంపికలు జరుగుతాయన్నారు.

March 26, 2026 / 01:34 PM IST

దరఖాస్తు గడువు పొడిగింపు: జిల్లా కలెక్టర్

BHPL: 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద BHPL జిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుంచి వివిధ ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తు చివరి తేదీని 24.03.2026 నుంచి 02.04.2026 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు 671 దరఖాస్తులు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హత గల వారు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 26, 2026 / 01:31 PM IST

బంట్వారంలో నీటి సమస్య.. ఇబ్బందుల్లో ప్రజలు

VKB: బంట్వారం మండల కేంద్రంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు ఇప్పటికీ వినియోగంలోకి రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకులు నిర్మాణం పూర్తయినా వాటికీ నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి పనికిరాక గాలికి వదిలేసినట్లుగా మారాయి. నీటి కొరతతో రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 01:30 PM IST

టీబీ రహిత పంచాయతీగా మెదవాడకు గుర్తింపు

CTR: ఎస్ఆర్ పురం మండలంలోని ఆరి మాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెదవాడ గ్రామపంచాయతీని ప్రభుత్వం టీబీ రహిత పంచాయతీగా అధికారికంగా గుర్తించింది. గ్రామంలో క్షయవ్యాధి నిర్మూలనకు చేపట్టిన సమగ్ర చర్యలు, వైద్య సిబ్బంది కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా మెదవాడ సర్పంచ్‌తో పాటు వైద్య సిబ్బంది అవార్డు అందుకుంటూ గౌరవం పొందారు.

March 26, 2026 / 01:29 PM IST

భోగ్ భండార్ సమర్పించిన భక్తులు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఉన్న గల మహాలక్ష్మి ఆలయం వద్ద ఇవాళ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని భోగ్ బండార్ సమర్పించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, ఫకీర, ఆడే దిగంబర్, అనిల్ నాయక్ తదితరులున్నారు.

March 26, 2026 / 01:29 PM IST

సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతి నాయక్

HNK: సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హనుమకొండ రాంనగర్‌కు చెందిన భూక్యా తిరుపతి నాయక్, హన్మకొండ జిల్లా సెక్రటరీగా గుగులోతు శంకర్ నాయక్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్, జిల్లా అధ్యక్షుడు మురళీనాయక్ వారికి నియామక పత్రాలను అందజేశారు. గిరిజన జాతి అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.

March 26, 2026 / 01:28 PM IST

‘X’పై కేరళ పోలీసులు కేసు నమోదు

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రధాని మోదీపై, కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఏఐ ఆధారిత వీడియోలు Xలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు తప్పుదారి పట్టించేలా, PMతో పాటు CEC పరువుకు భంగం కలిగేలా ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీంతో Xతో పాటు వీడియోను పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

March 26, 2026 / 01:27 PM IST

సుమారు రెండు క్వింటాల మిర్చి దొంగతనం

KMM: మధిర మండలం మల్లారం గ్రామంలో రైతు కర్నాటి స్టాలిన్‌కు చెందిన సుమారు రెండు క్వింటాల మిర్చి దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి మరి పండించిన చేతికి వచ్చిన పంటను గుర్తు తెలియని దుండగులు ఇలా చేయడం సరికాదని వాపోయారు. పోలీసులు దొంగలను గుర్తించి తమకు న్యాయం చేయాలని రైతు వేడుకున్నారు.

March 26, 2026 / 01:25 PM IST

పార్క్‌ను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే

HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 5వ వార్డు శ్రీపురి కాలనీలో పార్క్‌ను కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పునర్నిర్మించారు. ఈ పార్క్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంతో గురువారం ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరయ్యారు. అన్ని వసతులతో పార్క్‌ను పునర్నిర్మించడంతో కాలనీవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

March 26, 2026 / 01:25 PM IST

దివ్యాంగురాలికి భరోసా కల్పించిన MLA వినోద్

MNCL: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని బెల్లంపల్లి MLA వినోద్ స్పష్టం చేశారు. ఇవాళ పట్టణంలోని అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్న దివ్యాంగురాలిని స్వయంగా కలిసి మాట్లాడారు. తన ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఆమె MLAకు వివరించగా, సానుకూలంగా స్పందించిన MLA తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తన కర్తవ్యం అన్నారు.

March 26, 2026 / 01:25 PM IST