సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రధాని మోదీపై, కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఏఐ ఆధారిత వీడియోలు Xలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు తప్పుదారి పట్టించేలా, PMతో పాటు CEC పరువుకు భంగం కలిగేలా ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీంతో Xతో పాటు వీడియోను పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.