W.G: ఉండి కృషివిజ్ఞాన కేంద్రంలో రొయ్యల పెంపకంలో అనుసరించవలసిన మేలైన యాజమాన్యం పద్ధతులపై గురువారం శిక్షణా తరగతులను ప్రారంభించినట్టు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లిఖార్జునరావు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక రెవిన్యూ ఉన్న రొయ్యల సాగులో రైతులకు కొన్ని మెలుకువలు తెలుపుతాము అన్నారు. ఐదు రోజుల పాటు శిక్షణ జరుగుతుంది చెప్పుకొచ్చారు.