AP: ఈ నెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతి పై చర్చించి, తీర్మానించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాజధాని చరిత్ర ప్రజలకు తెలియజేయాలని CM చంద్రబాబు సూచించారు. విద్యుత్ వ్యవస్థపై కేబినెట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో 2వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.