AP: దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5 సవరించాలని.. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.