AP: ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేవారికి ప్రోత్సాహమిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం పథకం సబ్సిడీ కూడా ఈ పథకానికి అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని మరోసారి స్పష్టం చేశారు.