• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఈనెల 29లోపు ధాన్యాన్ని విక్రయించాలి’

AKP: జిల్లాలో రైతులు ఈనెల 29వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని విక్రయించాలని జేసీ సౌర్యమాన్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 65 రైతు సేవా కేంద్రాల ద్వారా 70.946 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21,162 మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 09:24 PM IST

గురుకుల సీట్లు సాధించిన 15 మంది విద్యార్థులు

HNK: నడికూడ(M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుండి 16 మంది విద్యార్థులు గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష రాయగా 15 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ సన్మానించారు. విద్యార్థులు కష్టపడి చదివి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు.

March 25, 2026 / 09:22 PM IST

కృష్ణ ఫార్మర్స్ కోపరేట్ సొసైటీని ప్రారంభించిన కేడీసీసీ ఛైర్మన్

NTR: జగ్గయ్యపేట కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ ఛైర్మన్ రఘురాం పాల్గొని నూతన సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. భవనంలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించి, రైతులకు సేవలందించేందుకు చేపట్టిన చర్యలకు గాను అభినందించారు. చివరిగా సభ్యులకు డివిడెంట్‌లను అందజేశారు.

March 25, 2026 / 09:21 PM IST

జోగాపూర్‌లో ఉద్రిక్తత.. వివాదానికి తెరలేపిన స్పీడ్ బ్రేకర్

SRCL: చందుర్తి మండలం జోగాపూర్- రామారావు పల్లి గ్రామాల మధ్య పంచాయతీ పాలకవర్గం రాత్రి స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా ఒక వ్యాను రావడంతో స్పీడ్ బ్రేకర్ మీదుగా వెళ్లవద్దని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, వ్యాన్ డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న వారికి మధ్య వివాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

March 25, 2026 / 09:21 PM IST

శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం కార్యక్రమం

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి పండుగను నిర్వహించనున్నారు. భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమ ఏర్పాట్లను టీడీపీ యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 25, 2026 / 09:17 PM IST

‘పెద్ది’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 27న ఉ.11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.

March 25, 2026 / 09:16 PM IST

5,000mah బ్యాటరీతో శాంసంగ్ A375జీ

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్.. A37 5జీ పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 8.5, 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 50MP+ 08 MP+ 05MP కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా, 5,000mah బ్యాటరీ, IP68 రేటింగ్‌తో వస్తుంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.41,999గా కంపెనీ నిర్ణయించింది.

March 25, 2026 / 09:15 PM IST

ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తాం: మంత్రి

TG: 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో ఇందిరమ్మ ఇళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రస్తుతం పూర్తైన ఇళ్లకు నాణ్యతా లోపాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

March 25, 2026 / 09:15 PM IST

స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో వాయిస్ కమాండ్స్‌తో ఆర్డర్స్

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ తన సేవలను సులభతరం చేయనుంది. ఈ మేరకు సర్వం ఏఐ అసిస్టెంట్ ‘ఇండస్’ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్విగ్గీ, క్విక్ కామర్స్ విభాగమైన ఇన్‌స్టామార్ట్, డైనవుట్ యాప్‌లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. హిందీ, తెలుగు, బెంగాళీ వంటి 11 స్థానిక భాషల్లో వాయిస్ మోడల్స్‌ను ట్రైన్ చేశారు.

March 25, 2026 / 09:13 PM IST

HIT TV కథనానికి స్పందించిన కలెక్టర్

WGL: నగరంలోని CKM ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్ల దందా జరుగుతోందని మార్చి 17న HIT TVలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద స్పందించారు. ఆసుపత్రిని స్వయంగా సందర్శించి, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చినందుకు HIT TVకు, స్పందించిన కలెక్టర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 09:12 PM IST

ALERT: పండ్ల రసాలు తాగుతున్నారా? 

పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బయట విక్రయించే ప్యాక్ చేసిన జ్యూస్‌ల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలకు దారితీయవచ్చు. పండ్లను రసంగా తాగడం కంటే, పండ్లను అలాగే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

March 25, 2026 / 09:12 PM IST

హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన స్పెషల్ ఆఫీసర్

MHBD: కొత్తగూడ మండలానికి స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రాజేశ్వర్ బుధవారం మండల పరిధిలోని AHS సాదిరెడ్డిపల్లె హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత పరిశీలించారు. ముఖ్యంగా టాయిలెట్ల పనితీరు, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీచేసి, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలన్నారు.

March 25, 2026 / 09:09 PM IST

లోకేష్ కృషి వల్లే స్టీల్‌ప్లాంట్ వచ్చింది: అనగాని

AP: మిత్తల్ స్టీల్ ప్లాంట్.. ఉత్తరాంధ్రను ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చనుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ వచ్చేందుకు మంత్రి లోకేష్ చేసిన కృషే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల క్రెడిట్ తనదేనని మాజీ సీఎం జగన్ అంటున్నారని విమర్శించారు. లోకేష్‌కు మంచిపేరు రావడం చూసి జగన్ రగిలిపోతున్నారు.స

March 25, 2026 / 09:09 PM IST

ఒక్క IPL జట్టు అమ్మితే.. PSLను కొనవచ్చు

పాక్ ప్లేయర్లు PSLను IPLతో పోలుస్తూ ఉంటారు. అయితే, RCB (రూ.16,700 కోట్లు), RR (రూ.15,290 కోట్లు) వంటి ఒక్కో IPL జట్టు విలువ వేల కోట్లలో ఉంది. PSL లీగ్ మొత్తం విలువ కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే. దీంతో భారత నెటిజన్లు, కేవలం ఒక్క IPL జట్టును అమ్మితే పాక్ క్రికెట్ బోర్డు(రూ.450-580 కోట్లు)తో పాటు వారి మొత్తం లీగ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

March 25, 2026 / 09:07 PM IST

తల్లి మరణం తట్టుకోలేక.. కొడుకు ఆత్మహత్య

MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన సబ్బని సంతోష్ (40) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. 15 రోజుల క్రితం తల్లి భాగ్యమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఇవాళ భార్య పుష్పలత, సోదరి మంజులను మేనమామ ఇంటికి పంపాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సంతోష్ తల్లి మరణం తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

March 25, 2026 / 09:06 PM IST