AP:విశాఖలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇనార్బిట్ మాల్‌ను కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతిపెద్ద మాల్ తన నియోజకవర్గంలో ఏర్పాటు కావడం సంతోషకరమని, ఇది ఆ ప్రాంత ముఖచిత్రాన్నే మారుస్తుందని పేర్కొన్నారు.