హుండీలో డబ్బు వేసినా, శుభకార్యాలలో కట్నం పెట్టినా రూ.101, రూ.501.. ఇలా చివర్లో ఓ రూపాయి కలుపుతారు. దీనివల్ల విడదీయలేని బంధం ఏర్పడుతుందని నమ్ముతారు. చివర్లో 1 ఉంటే అది అనేక సందర్భాల్లో విభజించడానికి వీలులేని సంఖ్యలా మారుతుంది. అలాగే ఆ రూపాయి భవిష్యత్తులో మరింత సంపదకు ప్రారంభాన్ని కూడా సూచిస్తుందట. ఒకవేళ చివర్లో ‘0’ ఉంటే ఆ సంఖ్యను ముగింపుగా భావిస్తారు.