AP: ఇప్పటివరకు రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని మంత్రి పార్థసారథి తెలిపారు. తాము సాధించిన పెట్టుబడుల ద్వారా 9.62 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. విశాఖ, అనకాపల్లిలో ఏఐ డేటా ప్రాజెక్టు, విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన కోసం సీటెక్కు భూముల కేటాయింపునకు ఆమోదించమని చెప్పారు.