TG: రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గణపతి ఆత్మహత్యపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలపపోయి రాబందుల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు నానాకష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.