AP: YSR మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసిన కేసులో వైసీపీ నేత పేరాడ తిలక్ ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలతో టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.