TG: సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ చైతన్య కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.