AP: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో ఆరుగురు నిందితుల ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. NIA, IB, కొత్తపేట పోలీసులు సంయుక్తంగా వీరిని విచారించారు. ముఖ్యంగా సోషల్ మీడియా లింక్స్‌పై ఆరా తీశారు. 12 మంది సాక్షుల వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేశారు. తదుపరి దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.