AP: అనంతపురం జిల్లా బసంపల్లిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగు స్థానిక పొలాల్లో సంచరిస్తోంది. ఈ క్రమంలో దాన్ని చూసిన స్థానికులు, రైతులు పరుగులు తీశారు. ఎలుగును పట్టుకుని ఇక్కడి నుంచి తరలించాని అటవీ అధికారులను కోరుతున్నారు. ఇటీవల కాలంలో అడవి జంతువుల సంచారం పెరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.