TG: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘X’లో స్పందించారు. 2023 సెప్టెంబర్లో తాను చేసిన పోస్టును ట్యాగ్ చేశారు. మూడేళ్ల క్రితం BRS అభిప్రాయం చెప్పామని, అందులో మార్పు లేదని స్పష్టం చేశారు. పునర్విభజనలో అన్యాయం జరిగితే దక్షిణాదిలో బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ పాలకులు తమ మాటలు వింటారని నాడు కేటీఆర్ పేర్కొన్నారు.