AP: విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్లో రైళ్లు రెండు గంటలపాటు నిలిచిపోయాయి. దువ్వాడలోని రెండో లైనులో విద్యుత్ తీగలు తెగిపడి అంతరాయం ఏర్పడింది. దీంతో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాంపై కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన అధికారులు రాకపోకలను పునరుద్ధరించారు.