BDK: సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో గంజాయి యువత భవిష్యత్తుకు ఒక నిశ్శబ్ద ముప్పుగా మారుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరదా కోసం,లేదా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభమయ్యే గంజాయి వినియోగం, క్రమంగా వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బలహీనపరిచే వ్యసనంగా మారుతున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.