RR: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దిల్సుఖ్నగర్ నుంచి కొత్తపేట వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పచ్చదనాన్ని పెంచుదాం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని పేర్కొన్నారు.