AP: పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ కేడర్‌ను అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ‘మఫ్టీలో వచ్చి మనుషులను ఎత్తుకెళ్తున్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై పవన్ నోరు విప్పాలి. రెండేళ్లలో కాపు కార్పొరేషన్‌కు ఎన్ని నిధులు ఇచ్చారు. జనసేన నేతలు నిలదీయాలి’ అని డిమాండ్ చేశారు.