AP: వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8:45 గంటలకు కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8:50 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనున్నారు.