AP: జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆమె సంస్థ ద్వారా 300 మంది ఉద్యోగుల ఖాతాల్లో అదనంగా రూ.1-2 లక్షలు జమ చేసినట్లు మాజీ ఉద్యోగి ఆనంద్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ మొత్తాన్ని తిరిగి నగదుగా తీసుకుని ఎన్నికల ఖర్చులకు వాడినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించగా, అఫిడవిట్ ఖర్చులు, వాస్తవ ఖర్చుల్లో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.