W.G: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఇవాళ భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 6 నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల పరిధిలో 862 గ్రామాలకు రూ.1400 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు జరుగుతోందన్నారు.