WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,570 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 20,600 ధర పలకగా.. వండర్ హాట్(WH) రూ. 30వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ. 19,250, ఎల్లో మిర్చి రూ. 22వేలు పలికాయి. మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.