TG: కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవికి BRS నేత మన్నె క్రిశాంక్ లేఖ రాశారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు ఇచ్చిన సెల్ఫోన్లలో భారీ స్కామ్ జరిగిందని మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేశారు. అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్పై విచారణకు తాము డిమాండ్ చేస్తే మంత్రి సీతక్క ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.