ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వింతగా మారింది. ఏపీ, తెలంగాణల్లో తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఒకేసారి ఎండలు, వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.