BHPL: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సన్మానించారు.