SS: జిల్లాలో సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా సగటు వర్షపాతం 7.9 మి.మీ నమోదైందని తెలిపారు. జిల్లాలోని మొత్తం 32 మండలాలకు గాను 18 మండలాల్లో వర్షం కురిసింది. ఓబులదేవరచెరువు మండలంలో అత్యధికంగా 58.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, బుక్కపట్నంలో 36.4, కదిరిలో 27.2 మి.మీ వర్షం పడింది.