SKLM: సంతబొమ్మాళి మండలం తోటాడ గ్రామంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఎన్డీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఆయన తెలియజేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో PACS మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, తదితరులు ఉన్నారు.