TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ‘కాగ్’ ఆడిట్ నిర్వహించనుంది. జూన్ నుండి అధికారులు జిల్లాల వారీగా స్కూళ్లను సందర్శించనున్నారు. ముఖ్యంగా 1-5 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, FLN లక్ష్యాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. గత సర్వేల్లో రాష్ట్రానికి మెరుగైన ఫలితాలు రాగా, తాజా ఆడిట్ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.