BPT: జిల్లాలో హెల్మెట్ వాడకంపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఆయన స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై నగరంలో ప్రయాణించారు. తన ఆచరణ ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.