ASR: అరకులోయ మండల కేంద్రంలోని సినిమా హాల్ ఎదురుగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.