TG: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. వాటితో భేటీ అయిన శ్రీధర్ బాబు.. తెలంగాణ-నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చించారు.