TG: CM రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేశారు. బడ్జెట్‌కు ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. కేంద్రం ఇప్పటివరకు రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. BRS, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అని విమర్శించారు.