TG: రాష్ట్రంలో వాతావరణం విచిత్రంగా మారింది. తీవ్ర వడగాల్పుల ముప్పుతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, క్యుములోనింబస్ మేఘాల వల్ల నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములతో కూడిన మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణశాఖ అంచనా వేసింది.