AP: విజయనగరంలో హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మూలపేట పోర్టు పనుల్లో 70 శాతం కూటమి సర్కార్ పూర్తిచేసిందని, అయితే వైసీపీ ప్రతి విషయంలోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోందని విమర్శించారు. అమరావతి రాజధానిపై వైసీపీ తన స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు R&R పాలసీని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.